శ్రీ కృష్ణుడు
*మాతః కిమ్ యదునాథ? దేహి చషకం, కింతేన? పాతుం* *పయః*
*తన్నాస్తద్య, కదాస్తివా? నిశి,* *నిశా కావా* *న్దకార్యోదయః*
*ఆమీల్యాక్షియుగం* *నిశాప్యుపగతా దేహీతి* *మాతుర్ముహు* :
*వక్షోoజాశుక కర్షణోద్యత కరః కృష్ణ: స పుష్ణాతు నః*
బాలకృష్ణుడు నందగోకులంలో ఆడుకుంటున్నాడు. అతని తల్లి యశోదాదేవి పెరుగు
చిలుకుతోంది
కృష్ణుడు అక్కడకు వెళ్లి అమ్మా! అమ్మా! అని పిలిచాడు.ఏమి యదునాథ? అన్నది
యశోద. ఒక పాత్ర ( గ్లాసు)యివ్వమ్మా. అన్నాడు బాలకృష్ణుడు. దేనికిరా? అన్నది
యశోద, పాలుత్రాగుతానమ్మా. అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు పాలేమిటి? లేవుపో అన్నది
యశోదమ్మ. అయితే ఎప్పుడుంటాయి పాలు? అడిగాడు కృష్ణుడు. రాత్రయితే
పాలుంటాయి తల్లి సమాధానం. రాత్రంటే ఏమిటి? ఎలావుంటుంది?ఎప్పుడొస్తుంది?
బాలుని ఆరాటం.ఎప్పుడు చీకటి పడుతుందో అది రాత్రి. తల్లి వివరణ. వెంటనే
కృష్ణుడు రెండు కళ్ళూ మూసుకున్నాడు. ఇదేమిటి ఈ పిల్లాడు
కళ్ళుమూసుకుంటున్నాడు?అనుకుంది తల్లి. ఇదిగో రాత్రి అయిపొయింది పాత్ర
యియ్యి అంటూ ఆమెపైట కొంగు పట్టి లాగుతున్నాడు కృష్ణుడు. ఇదేమిటి? తాను
కళ్ళు మూసుకుంటే రాత్రయిపోతుందా? పిల్లి కళ్ళుమూసుకొని పాలు త్రాగుతూ
తననెవరూ చూడలేదు అనుకుంటుందట యిదే అలాంటిదేనా?
కాదు కాదు.పగటిని, రాత్రిని ఏర్పాటు చేసేది సూర్య చంద్రులు. సూర్యుడు అస్తమిస్తే
రాత్రవుతుంది, చంద్రుడు అస్తమిస్తే పగలౌతుంది. వారిద్దరూ శ్రీమన్నారాయణునికి
రెండు కళ్ళు.
ఈ కృష్ణుడు శ్రీమన్నారాయణుడి అంశ కనుక ఈతడు తన రెండుకళ్ళూ
మూసు కుంటే అంతా చీకటి అయిపోతుంది కదా! చీకటి అంటే రాత్రే కదా! . అటువంటి శ్రీకృష్ణుడు మనల్ని కాపాడుగాక! అని వర్ణన.
No comments:
Post a Comment