Monday, 17 April 2023

ర్యాలీ పుణ్యక్షేత్రం

 *ర్యాలి* :


ప్రకృతి మాత ముద్దుబిడ్డ కోనసీమ అందాన్ని చూసి పరవశించిపోవడం మన వంతైతే జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏకంగా స్థాణువయ్యాడట. ఇక్కడ తలలో పువ్వు పోగొట్టుకున్న జగన్మోహిని, బదిలీ కోరిన భక్తుల కోర్కెను ఇట్టే తీరుస్తుందని భక్తుల విశ్వాసం. చెరొక చోట ఉద్యోగం చేసే భార్యాభర్తలను ఒక చోటికి చేర్చడంలో ఈదైవంచూపే కారుణ్యం కొనియాడదగినది. ఈ అరుదైన యాత్రాస్థలం మన రాష్ట్రంలోనే గోదావరి గట్టున ఉంది.


ఎక్కడ ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు. నిండైన కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించడంవల్ల ఈ ప్రాంతం సాక్షాత్తూ 'అన్నపూర్ణ'. ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని. ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో? నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇందులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది నిజమైన నిదర్శనం. కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి. అదేవిధంగా 'శిఖ' జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా, నిజంగా జుట్టు ఉందా? అనిపించేలా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే,!. ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది.అది 'విష్ణు పాదోధ్బవియైన గంగ' అనే ఆధ్యాత్మిక నమ్మకం. ఆమాట పక్కన పెడితే,, శిలల్లో 'జలశిల' అనే దాన్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. గుడిప్రాంగణమంతా దశావతారాలకి సంబంధించిన శిల్పాలు కొలువై ఉన్నాయి.


ఎప్పుడు నిర్మించారు?

ర్యాలి ప్రాంతం 11వ శతాబ్ది సమయంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధరించారు.


ఎలా చేరుకోవాలి?

ర్యాలిని దర్శించడానికి ఉత్తర భారతంనుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి)తుని, అన్నవరం, రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్ళి, బొబ్బర్లంక దగ్గర ఎడమవైపు తిరగాలి. బొబ్బర్లంక మీదనుంచి లొల్లమీదుగా మెర్లపాలెం దగ్గర కుడివైపుకి తిరిగితే ర్యాలి చేరుకుంటాం.


విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి), దగ్గర కుడివైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గర ఎడమవైపు తిరిగితే ర్యాలి చేరుకోవచ్చు.


ర్యాలి ప్రాధాన్యత!


గోదావరి జిల్లా ప్రాంతంలో(రాలి-అంటేపడిపోవటం.అదేమార్పుచెంది 'ర్యాలి' గామారింది. '. ఈ ప్రాంతాన్ని పూర్వం 'రత్నపురి' అని పిలిచేవారు. భాగవత కధ ప్రకారం... దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యాడు. దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిపట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు. ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది. ఆ కారణంగా ఆప్రాంతానికి 'ర్యాలి' అని పేరు వచ్చిందని స్థలపురాణం. విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.


తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుంది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠచేసేటపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో మంత్ర పూతం కావించాడని స్థలపురాణం. అదే విధంగా జగన్మోహినీకేశవస్వామి విగ్రహాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించారని చెబుతారు. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అణువణువూ చూపిస్తారు. నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.


సందర్శన వేళలు

ఉదయం ఆరు నుంచి పన్నెండు వరకు, తిరిగి మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకు. లోపల ఫోటోలు తీయడానికి అంగీకరించరు.

ర్యాలి చాలా చిన్న గ్రామం, అందువల్ల రావులపాలెం నుంచే ఆహారపదార్ధాలు తీసుకెళ్ళడం మంచిది.


ర్యాలి వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు లేవు. రాజమండ్రి అతిదగ్గరి రైల్వేస్టేషన్‌. మధురపూడి(రాజమండ్రి దగ్గర) అతి దగ్గరి విమానాశ్రయం. రావులపాలెం దాకా బస్సులు దొరుకుతాయి. అక్కడి నుండి ఆటోలు గాని, టాక్సీల ద్వారాగాని ర్యాలి చేరుకోవాలి. పట్టణాలలో వాహనాలమీద తిరిగి విసుగెత్తిన వారికి గుర్రపుబండి ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. గుర్రపు డెక్కల చప్పుడు, రోడ్డుకిరువైపులా పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, దారిలో చిన్న చిన్న పిల్లలు వీడ్కోలు పలుకుతూ టాటా చెప్పడం, ఇలాంటి అనుభూతుల్ని మనం సొంతం చేసుకోవచ్చు.


బదిలీ కావాలనుకున్నవారు ఈ దేవుణ్ణి సందర్శిస్తే తమ కార్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.


ర్యాలి సందర్శనంతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని, పంచారామాలలోని నాలుగు ఆరామాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం కూడ కలుపుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న అంతర్వేది, కోటిపల్లి, ధవళేశ్వరం బ్యారేజి, రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి, కోటి లింగాలరేవు, సారంగధర మెట్ట కూడ కలుపుకుంటే గోదావరి నదీతీర ప్రాంతంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాన్ని చూసినవాళ్ళం అవుతాం.


                           స్వస్తి!

పెరుగు తో oops concept ఎలాగో మీరే చూడండి

పెరుగు


#పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి*.


1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.


2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని 

తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.


3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.


4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.


5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.


6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.


7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.


8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.


9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది. 


10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

కాశీ లో తెలుసుకో తగ్గ ఘాట్ యొక్క వివరాలు

 Kasi ghat


కాశీ.....


గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.


శివుని కాశీలోని కొన్ని వింతలు.

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 


అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి, అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 

అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


కాశీ 


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి... ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి 

ఎన్నో వున్నాయి. 


అందులో కొన్ని.....


1) దశాశ్వమేధ ఘాట్...


బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్...


ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్...


చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్...


సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్...


పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్...


ఇది కాశీలో మొట్ట మొదటిది. 

దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు.

ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. 

ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్...


ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. 

ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


 పంచ గంగా ఘాట్...


ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్...


గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్...


తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్...


ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్...


పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్...


సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...


14) మానస సరోవర్ ఘాట్...


ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.


15) నారద ఘాట్.. 


నారదుడు లింగం స్థాపించాడు.


16) చౌతస్సి ఘాట్...


ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 

64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... 

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 

64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.


17) రానా మహల్ ఘాట్...


ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.


18) అహిల్యా బాయి ఘాట్...


ఈమె కారణంగానే మనం ఈరోజు 

కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. 


కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.


పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.


కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 


నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 

మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.


కాశీ స్మరణం మోక్షకారకం...


|ఓం నమః శివాయ

యశోద మరయు శ్రీ కృష్ణ

 శ్రీ కృష్ణుడు


 *మాతః కిమ్ యదునాథ? దేహి చషకం, కింతేన? పాతుం* *పయః* 

 *తన్నాస్తద్య, కదాస్తివా? నిశి,* *నిశా కావా* *న్దకార్యోదయః* 

 *ఆమీల్యాక్షియుగం* *నిశాప్యుపగతా దేహీతి* *మాతుర్ముహు* :

 *వక్షోoజాశుక కర్షణోద్యత కరః కృష్ణ: స పుష్ణాతు నః* 


బాలకృష్ణుడు నందగోకులంలో ఆడుకుంటున్నాడు. అతని తల్లి యశోదాదేవి పెరుగు 

చిలుకుతోంది 

కృష్ణుడు అక్కడకు వెళ్లి అమ్మా! అమ్మా! అని పిలిచాడు.ఏమి యదునాథ? అన్నది 

యశోద. ఒక పాత్ర ( గ్లాసు)యివ్వమ్మా. అన్నాడు బాలకృష్ణుడు. దేనికిరా? అన్నది 

యశోద, పాలుత్రాగుతానమ్మా. అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు పాలేమిటి? లేవుపో అన్నది 

యశోదమ్మ. అయితే ఎప్పుడుంటాయి పాలు? అడిగాడు కృష్ణుడు. రాత్రయితే 

పాలుంటాయి తల్లి సమాధానం. రాత్రంటే ఏమిటి? ఎలావుంటుంది?ఎప్పుడొస్తుంది? 

బాలుని ఆరాటం.ఎప్పుడు చీకటి పడుతుందో అది రాత్రి. తల్లి వివరణ. వెంటనే 

కృష్ణుడు రెండు కళ్ళూ మూసుకున్నాడు. ఇదేమిటి ఈ పిల్లాడు 

కళ్ళుమూసుకుంటున్నాడు?అనుకుంది తల్లి. ఇదిగో రాత్రి అయిపొయింది పాత్ర 

యియ్యి అంటూ ఆమెపైట కొంగు పట్టి లాగుతున్నాడు కృష్ణుడు. ఇదేమిటి? తాను 

కళ్ళు మూసుకుంటే రాత్రయిపోతుందా? పిల్లి కళ్ళుమూసుకొని పాలు త్రాగుతూ 

తననెవరూ చూడలేదు అనుకుంటుందట యిదే అలాంటిదేనా?


కాదు కాదు.పగటిని, రాత్రిని ఏర్పాటు చేసేది సూర్య చంద్రులు. సూర్యుడు అస్తమిస్తే 

రాత్రవుతుంది, చంద్రుడు అస్తమిస్తే పగలౌతుంది. వారిద్దరూ శ్రీమన్నారాయణునికి

రెండు కళ్ళు. 


ఈ కృష్ణుడు శ్రీమన్నారాయణుడి అంశ కనుక ఈతడు తన రెండుకళ్ళూ 

మూసు కుంటే అంతా చీకటి అయిపోతుంది కదా! చీకటి అంటే రాత్రే కదా! . అటువంటి శ్రీకృష్ణుడు మనల్ని కాపాడుగాక! అని వర్ణన.


Donkey and the Tiger


The donkey told the tiger: The grass is blue. 


The tiger replied: No, the grass is green​.


The discussion became heated, and the two decided to submit the issue to arbitration, and to do so they approached the lion. 


Before reaching the clearing in the forest where the lion was sitting on his throne, the donkey started screaming: ′′Your Highness, isn't it true that the grass is blue?"​


The lion replied: "True, the grass is blue"​. 


The donkey rushed forward and continued: ′′The tiger disagrees with me and contradicts me and annoys me. Please punish him"​.


The king then declared: ′′The tiger will be punished with 5 years of silence"​.


The donkey jumped with joy and went on his way, content and repeating: ′′The grass is blue"​..


The tiger accepted his punishment, but he asked the lion: ′′Your Majesty, why have you punished me, after all, the grass is green?"​


The lion replied: ′′In fact, the grass is green"​.


The tiger asked: ′′So why do you punish me?"​


The lion replied:


That has nothing to do with the question of whether the grass is blue or green. The punishment is because it is not possible for a brave, intelligent creature like you to waste time arguing with a donkey, and on top of that to come and bother me with that question


The worst waste of time is arguing with the fool and fanatic who doesn't care about truth or reality, but only the victory of his beliefs and illusions. Never waste time on discussions that make no sense... There are people who for all the evidence presented to them, do not have the ability to understand, and others who are blinded by ego, hatred and resentment, and the only thing that they want is to be right even if they aren’t. 


When ignorance screams, intelligence shuts up. Your peace and tranquility are worth more.


అమరావతి కథలు - శంకరమంచి సత్యం

 అమరావతి కథలు -శంకరమంచి సత్యం. 


#'అమరావతి గుంటూరు జిల్లాలో ఓ వూరు యిది. 

అక్కడ అమరేశ్వరుడు వెలసి వున్నాడు. క్షేత్రపాలకుడైనా వేణుగోపాలస్వామి గుడి వుంది. 

పైగా బౌద్ధం విలసిల్లిన చోటు కూడాను.

 వాసిరెడ్డి నాయుడు రాజ్యం చేసిన చోటు. 

ఇంత ఇంపార్టెన్సు వుంది కాబట్టే అమరావతిని కేంద్రంగా చేసుకుని శంకరమంచి సత్యంగారు నూరు కథలు రాశారు. 

అవి ఎంత పాప్యులర్‌ అయ్యాయంటే శ్యామ్‌ బెనగల్‌ వాటిని బేస్‌ చేసుకుని 'అమరావతీ కీ కహానియాఁ' పేరుతో హిందీలో టీవీ సీరియల్‌గా తీశారు. దూర్‌దర్శన్‌లో దేశమంతటా ప్రసారం అయ్యాయి. 

ఆ కథల్లో రకరకాలైన థీమ్స్‌ వున్నాయి. ఇవి 100 కథలు. ఆంధ్రజ్యోతి వార పత్రికలో సీరియల్‌గా వచ్చాయి. తర్వాత 1978లో బాపుగారి బొమ్మలతో, ముళ్లపూడి వెంకటరమణగారి పీఠికతో పుస్తకరూపంలో వచ్చాయి. ఈ కథలకు 1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత హిందీలో  

అమరావతి కథలు చెప్పేముందు అమరావతి ఎక్కడుందో చెప్పాలిగా, ఎలా వెళ్లాలో చెప్పాలిగా. అదీ సత్యంగారే చెప్పారు 

 'అదుగో అల్లదుగో' అనే కథలో - గుంటూరులో బస్సెక్కాలి.

 ఎక్కారా? తోసుకోటం, గుద్దుకోటం, ముందెక్కుతున్నవాళ్లని వెనక్కి లాగేయటం, వెనకున్నవాళ్లని మోచేతుల్తో కుమ్మేయటం అన్నీ అయ్యాయా -

'ఏందయ్యా, ఆడంగుల్ని ముందెక్కనీ' - 'అమ్మో నా కాలు తొక్కేశారు, దేవుడోయ్‌'

'చెవులవీ చేతులవీ జాగర్తేవ్‌' - 'సామాన్లు కిటికీలోంచి లోపలకి తోసేయ్‌'... లాటి కేకలు వినబడ్డాయా? 

బస్సు బరువెక్కింది. కిక్కిరిసిన జనాలు, శనక్కాయ మూటలు, ధనియాల బస్తాలు, కూరగాయల బుట్టలు, రేకు పెట్టెలు, పలుపుతాళ్లు, పారలు, ఉక్క. బస్తా కుదించి మూతి కుట్టేసినట్టుంది. ఇక లోపలున్న జనాలు ఊరుకుంటారా?

'ఏందమ్మా! అంత సోటుంటే మీది మీదికి పడ్తావూ..?'

'సుట్ట తీసేవోయ్‌ సోగ్గాడ...అప్పుడే ముట్టించాడు..దొర చుట్ట' అంటూ చిన్న చిన్న తగాదాలు. 

కండక్టరు కారా కిళ్లీ నముల్తూ వచ్చాడు. 'ఎవరివీ బస్తాలూ..? ఈ బుట్టల్దీసెయ్‌!.. ఎడ్లబండనుకున్నారా?..గోరంట్లకి మూడు టిక్కెట్లా? సిటీబస్‌లో పోలేవూ? దిగుదిగు.' ఇలా అంటూ టిక్కెట్లు కోస్తూండగానే డ్రైవర్‌, క్లీనరూ వచ్చేశారు. క్లీనర్‌ 'సొంత యిల్లంటయ్యా పరుపుల మీద కూకున్నట్టు కూకోడానికి. పదిమంది కూకునే చీటు. సర్దుగోండి' అంటూ హంగు చేస్తూ 

జూనియర్‌ డ్రైవర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్‌ 

'గురూ! రైటుక్కొయ్‌ ఎడంకి లాగుతోంది జాగర్త... ఎనక లారీవోడొస్తున్నాడు సైడియ్‌..ముందు మేకపిల్లుంది సూస్కో.. చింతకాయలు కొట్టుకునే ఆ పిల్లనేం జూస్తావ్‌..ముందు రోడ్డు చూడు బే!' అంటూ పార్థసారథియై బస్సును, కథ నడిపిస్తాడు. 

గోరంట్ల, లాం, నిడుముక్కల వచ్చాయి వెళ్లాయి. మోతడక పొలిమేరల్లో డ్రైవరుగారు బస్‌ ఆపేసి 'ఇంజను హీటెక్కింది. 

నీళ్లు పొయ్యి' అని అక్కడున్న గుడిసెలోకి వెళ్లిపోయేడు. కాస్సేపు పోయాక వచ్చాడు... బస్సు పధ్నాలుగో మైలు వచ్చింది. అక్కడ కాఫీలు తాగమని పర్మిషన్‌ యిచ్చారు. మరో పావుగంట తర్వాత యండ్రాయి వచ్చింది. ఆ తర్వాత నరుకుళ్లపాడు. 

ఓ మైలు పోతే కృష్ణగాలి వచ్చింది. 

మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కన్పించింది.

 మరో అరమైలు ఉందనగా దేవాలయ గోపురం,.

.అదిగో శిఖరం.. దీపాలదిన్నె.. అమరావతి వచ్చేశాం. 

'ఓల్డన్‌' అన్నాడు క్లీనర్